యక్ష ప్రశ్నలు

ధర్మరాజును పరీక్షించేందుకు యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగిన ప్రశ్నలు & వాటికి సమాధానాలు

  1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
  2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
  3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
  4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
  5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
  6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
  7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)
  8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)
  9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)
  10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)
  11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)
  12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
  13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
  14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
  15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
  16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
  17. తృణం కంటే లేసైనది ఏది? (చింత)
  18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
  19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
  20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)
  21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
  22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)
  23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)
  24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
  25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
  26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
  27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
  28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
  29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
  30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
  31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
  32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)
  33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
  34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
  35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
  36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
  37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
  38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
  39. ఎవరితో సంధి శిథిలమవదు? (సజ్జనులతో)
  40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
  41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
  42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)
  43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)
  44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
  45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)
  46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)
  47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
  48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
  49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)
  50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
  51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
  52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
  53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
  54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)
  55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
  56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
  57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
  58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
  59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
  60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
  61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)
  62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
  63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)
  64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
  65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
  66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
  67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)
  68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)
  69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
  70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
  71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)
  72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)…

Think 🔁ReThink

Think 1000 times before taking a decision But – After taking decison never turn back even if you get Thousand difficulties!!

Hitler golden words…